Labels

Wednesday, 4 November 2015

ముఖ్యమంత్రిని అభినందించిన కాపు సంఘ నేతలు

- కాపు కార్పోరేషన్ ఏర్పాటుపై హర్షం
- 22న విజయవాడలో కాపు సర్వసమ్మేళనం
                 విజయవాడ, నవంబర్ 3: విజయవాడ నగరంలో ఈనెల 22 వ తేదీన ‘సర్వకాపు సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు విజయవాడ నగర కాపు సంఘ నేతలు శ్రీ మల్లెమూడి కోటయ్య, మల్లెమూడి పిచ్చయ్య నాయుడు,  21 వ డివిజన్ కార్పోరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. విజయవాడ సెంట్రల్ శాసన సభ్యుడు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో వీరు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
కాపుల అభ్యున్నతికి రూ.100 కోట్లతో ‘కాపు కార్పోరేషన్’ ఏర్పాటు చేసినందుకు వారు చంద్రబాబును
అభినందించారు. బిసిలకు అన్యాయం జరగకుండా చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను వారు కొనియాడారు. కాపుల సంక్షేమానికి  ముఖ్యమంత్రి నిజాయతీగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. నవ్యాంధ్ర నిర్మాణానికి చంద్రబాబుకు తాము సంపూర్ణ సహకారం అందజేస్తామని, కాపులంతా ఆయనకు అండగా వున్నారని తెలిపారు.  22న సర్వకాపు సమ్మేళానికి నగరంలోని 60 డివిజన్ల నుంచి డివిజన్‌కు 500 మంది కార్యకర్తలతో మొత్తం 30 వేల మందిని సమీకరిస్తున్నట్లు వారు వివరించారు. సభకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించామని, పాల్గొనేందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. సభకు ఏర్పాటు ఘనంగా చేస్తామన్నారు. ముఖ్యమంత్రిని కలసిన వారిలో కాపునేతలు రాయపురెడ్డి శ్రీనివాస్, కోదండపాణి ,పైడి శ్రీను, అర్జా పాండురంగారావు పట్టెల శ్రీనివాసరావు, కంది అమరవెంకటేశ్వరరావు తదితరులున్నారు.

No comments:

Post a Comment